ఢిల్లీలో స్టాలిన్ బిజీ బిజీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. స్టాలిన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. స్టాలిన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి కావాల్సిన సాయంపై వినతి పత్రాన్ని అందచేయనున్నారు. గత ఏడాది సంభవించిన వరదల కారణంగా తమిళనాడు తీవ్రంగా నష్టపోయిందని, పునరావాసం కోసం నిధులు కేటాయించాలని ప్రధానిని స్టాలిన్ అభ్యర్థించనున్నారు. తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ ను కలసి తమిళనాడుకు రావాల్సిన ప్రయోజనాలపై చర్చించనున్నారు.
పార్టీ కార్యాలయాన్ని....
రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను స్టాలిన్ కలవనున్నారు. వామపక్ష నేతలతో కూడా స్టాలిన్ భేటీ ఉంటుంది. అదే సమయంలో ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో డీఎంకే కార్యాలయాన్ని స్టాలిన్ ప్రారంభించనున్నారు. ఢిల్లీలో అన్నా కలైంజర్ అరివాలయంను ఎప్పుడో నిర్మించినా కరోనా కారణంగా దీనిని ప్రారంభించడానికి వీలుకాలేదు. అందుకే ఏప్రిల్ 2వ తేదీన స్టాలిన్ ఢిల్లీలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.