ఘోర ప్రమాదం : పదిహేను మంది మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి పదిహేను మంది ప్రయాణికులు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి పదిహేను మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. ఆయన సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది వరకూ ఉన్నారని పోలీసులు తెలిపారు.
వంతెనపై నుంచి పడి...
ఈ ప్రమాదంలో ఇరవై మంది వరకూ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థిితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బస్సు ఇండోర్ వెళుతుండగాఅదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. దీంతో బస్సు తుక్కు తుక్కు అయిపోయింది. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి యాభైవేలు తక్షణ సాయం అందించనుంది. స్వల్పంగా గాయపడిన వారికి 25 వేలు ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.