TAX SLABS: కొత్త ఆదాయపన్ను విధానంలో పన్ను శ్లాబులు ఇవే
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం;

కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉంటే ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుందని తెలిపారు. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు.
కొత్త ఆదాయపన్ను విధానంలో పన్ను శ్లాబులు ఇవే:
0-4 లక్షలు: నిల్
4-8 లక్షలు: 5 శాతం
8-12 లక్షలు: 10 శాతం
12-16 లక్షలు: 15 శాతం
16-20 లక్షలు: 20 శాతం
20-24 లక్షలు: 25 శాతం
24 లక్షలపైన: 30 శాతం