Tamilanadu : ఎయిర్ షోలో విషాదం.. తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి.. అసలు రీజన్ ఇదేనా?

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తీవ్ర విషాదం నెలకొంది.మెరీనాబీచ్‌లో జరిగిన ఎయిర్ షో లో తొక్కిసలాటలో ఐదుగురు మరణంచారు.

Update: 2024-10-07 01:49 GMT

 Air show at marina beach

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న రాత్రి మెరీనాబీచ్‌లో జరిగిన ఎయిర్ షో లో తొక్కిసలాటలో ఐదుగురు మరణంచారు. చెన్నై మెరీనా బీచ్ లో ఆదివారం నాడు ఎయిర్‌ షోను నిర్వహించారు. ఎయిర్ షోను నిర్వహించేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు. ఎక్కువ మంది మెట్రో రైళ్లలో తరలి వచ్చారు. ఎయిర్ షో ముగిసిన వెంటనే తమ ఇళ్లకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఎక్కువ మంది గాయపడ్డారు.

గాయపడిన వారిని...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించారు. మొత్తం ఐదుగురు మరణించారు మరణించిన వారిని కార్తికేయన్, శ్రీనివాసన్, ాన్ బాబు, దినేష్ గా గుర్తించారు. ఈ ఎయిర్ షోకు దాదాపు పదిహేను లక్షల మంది తరలి వచ్చినట్లు అంచనా. మెట్రో రైళ్లు, బస్సులు, సొంత వాహనాల ద్వారా మెరీనా బీచ్ వద్దకు చేరకున్నారు. అయితే దాదాపు మూడు లక్షల మంది వరకూ లోకల్ ట్రెయిన్ లో ప్రయాణించి వచ్చారు. వారంతా తిరిగి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది.
రైల్వే స్టేషన్ లో...
ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో వృద్ధులు, చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒకరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వంద మందికి పైగా గాయపడటంతో వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా వెళ్లలేకపోయాయి. అంటే రోడ్డు మార్గం కూడా జనంతో ఎంతగా కిక్కిరిసి పోయిందో చెప్పాల్సన పనిలేదు. ఈ తొక్కిసలాటలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ షో ముగిసిన నాలుగు గంటల తర్వాత కానీ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News