Tourist Places: నవంబర్‌లో సందర్శించి అద్భుతమైన ప్రదేశాలు ఇవే..
భారతదేశంలో అనేక పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని ప్రాంతాల్లో సందర్శించేందుకు అనువుగా ఉంటాయి.
భారతదేశంలో అనేక పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని ప్రాంతాల్లో సందర్శించేందుకు అనువుగా ఉంటాయి. భారత్‌లో నంబర్ నెలలో ఈ ప్రాంతాల్లో సందర్శించడానికి అనువైనదిగా ఉంటుంది. ప్రాంతాల్లో చలికాలంలో సందర్శించేందుకు అద్భుతంగా ఉంటుంది. నవంబర్ నెలలో సందర్శించగల కొన్ని ఉత్తమ పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం.
కచ్ ఎడారి, గుజరాత్ :
శీతాకాలంలో కచ్ ఎడారిలోని తెల్లటి ఇసుక కనువిందు చేసేలా ఉంటుంది. గుజరాత్‌లో ఉప్పు ఎడారి అందానికి ఎంతో ప్రసిద్ది చెందింది. ఇదే కాకుండా ప్రతి ఏడాది అదే నెలలో రణ్ ఉత్సవ్ కూడా నిర్వహిస్తుంటారు. దీన్ని చూసేందుకు విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఇక భరత్‌పూర్, రాజస్థాన్- భరత్‌పూర్ బర్డ్ శాంక్చురీ అని పిలిచే కియోలాడియో నేషనల్ పార్క్ పక్షి ప్రేమికులకు అనువైన ప్రదేశంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 370 రకాల పక్షులు ఉంటాయి. నవంబర్ వచ్చేసరికి పెలికాన్స్, హంసలు, హాక్స్, బ్లూ టెయిల్డ్ బీ-ఈటర్స్ వంటి అనేక వలస పక్షులు కనువిందు చేస్తుంటాయి. చూసేందుకు రెండు కళ్లు సరిపోవన్నట్లుగా ఉంటుంది.
గోవా ఆహ్లాదకరమైన వాతావరణం
ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, చైనా, సైబీరియా నుండి పెద్ద సంఖ్యలో నీటి పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవి శీతాకాలంలో వస్తుంటాయి. గోవా- ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాకారులు, చిత్ర నిర్మాతలు, చిత్రాలను సందర్శిస్తారు. నవంబర్ నెల గోవా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అమృత్‌సర్, పంజాబ్- అమృత్‌సర్‌లో గురు పర్వ్ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు.
గోల్డెన్ టెంపుల్ అలంకరణ:
ఈ సమయంలో ఇక్కడ ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ అందంగా సుందంగా అలంకరిస్తారు. గురు పర్వ్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో లంగర్ నిర్వహిస్తారు. షిల్లాంగ్, మేఘాలయ- షిల్లాంగ్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఇక్కడ నిర్వహిస్తారు. ఈ కాలంలో చాలా మంది పెద్ద కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడానికి చేరుకుంటారు. అందుకే మీరు ఇక్కడి సంస్కృతి, ఆహారం, కళ , సంగీతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటే ఈ సమయం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను సందర్శించి తీరాలి.