ఒక వదంతి ముగ్గురి ప్రాణం తీసింది.. రైలు కింద పడి ముగ్గురి మృతి

ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి బయటకు దూకి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు

Update: 2024-06-15 02:14 GMT

ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి బయటకు దూకి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. దీనికి కారణం వదంతి మాత్రమే. తాము ప్రయాణిస్తున్న రైలులో బోగీకి నిప్పంటుకుందని కొందరు చేసిన ప్రచారం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. రాంచీ నుంచి ససారం ఎక్స్‌ప్రెస్ రైలు ధన్‌బాద్ డివిజన్ లోని కుమందిహ్ రైల్వేస్టేషన్ చేరకుంది. అక్కడ ఆగి ఉన్న సమయంలో కొందరు రైలు బోగీకి నిప్పంటుకుందని వదంతి లేపారు. దీంతో భయపడిన ప్రయాణికుల్లో ముగ్గురు రైలు నుంచి బయటకు దూకారు.

పక్క పట్టాలపై వస్తున్న...
అయితే అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలు కింద పడి వారు ముగ్గురు మరిణించారు. జార్ఖండ్ లో జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది. అగ్నిప్రమాదంచోటు చేసుకోకపోయినా కొందరు కావాలని ఈ ప్రచారం చేయడంతో ప్రయాణికులు భయపడి కిందకు దూకి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. రైలులో అగ్ని ప్రమాదంజరిగిందని ఒక వ్యక్తి నుంచి కుమందిహ్ స్టేషన్ కు ఫోన్ వచ్చిందని, అయితే రైలును తనిఖీ చేయగా అది ఆకతాయి పనిగా తేలింది. అయితే ఈ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చిందన్న దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు.


Tags:    

Similar News