నేడు వినాయక చవితి
నేడు వినాయక చవితి. దేశమంతా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నారు.
నేడు వినాయక చవితి. దేశమంతా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండగకు పల్లెల నుంచి పట్టణాలు నగరాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి పర్వదినాన గణేశుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, ఎటువంటి విఘ్నాలు కలగవని హిందువుల నమ్మకం. ఆ మేరకు ఆలయలతో పాటు ప్రతి ఇంట్లో వినాయకుడిని అధిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడానికి సిద్ధమయ్యారు.
మట్టి విగ్రహాలకు...
వినాయకుడిని పత్రితో పూజించి ఆయన వ్రతకల్పం కధ వింటే పుణ్యం దొరుకుతుందన్న విశ్వాసం హిందువుల్లో నెలకొని ఉంటుంది. ఈ మేరకు నగరాల్లో పత్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలకు ఎక్కువగా డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయనున్నారు. వినాయక చవితి సందర్భంగా "తెలుగు పోస్టు" పాఠకులకు శుభాకాంక్షలు.