Bengaluru : రేపు బెంగలూరులో జీరో షాడో

రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది;

Update: 2024-04-23 12:03 GMT
Bengaluru : రేపు బెంగలూరులో జీరో షాడో
  • whatsapp icon

రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం 12.17 గంటలనుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంటుందని తెలిపారు. నీడ కనిపించకుండా పోయే ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

నడి నత్తిమీద..
బెంగళూరు నగరంలో సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఈ జీరో షాడో ఏరపడుతుంది. భూమి సూర్యుడి చుట్టు తిరుగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో దాని స్థానం మారుతుంటుందని, ఏడాదిలో రెండు వేర్వేరు సమయాల్లో సూర్యుడు భూమికి నిటారుగా వస్తాడని అస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చెబుతుంది. నీడ మాయం కావడాన్ని అందరూ తిలకించవచ్చని అన్నారు.


Tags:    

Similar News