52 కోట్లు తీసుకోండి.. మిగిలింది ఇచ్చేయండి

వ్యాపారి పియూష్ జైన్ పన్ను మొత్తం తీసుకుని స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి తనకు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు

Update: 2021-12-31 04:18 GMT

ఉత్తర్ ప్రదేశ్ లోని సుగంధ ద్రవ్యాల వ్యాపారి పియూష్ జైన్ పన్ను మొత్తం తీసుకుని స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి తనకు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారి పియూష్ జైన్ నుంచి అధికారులు 195 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ పియూష్ జైన్ కోట్ల రూపాయలను గడించారు. అదే సయమంలో పన్ను కూడా ఎగ్గొట్టారు.

న్యాయస్థానంలో....
అధికారులు పియూష్ జైన్ ఇంటి నుంచి 195 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాను పన్ను ఎగ్గొట్టిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనికి సంబంధించి 52 కోట్ల రూపాయల పన్నును ప్రభుత్వం తీసుకుని మిగిలిన మొత్తాన్ని తనకు తిరిగి ఇచ్చేయాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పియూష్ జైన్ ఎప్పటి నుంచి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టారన్నది తేల్చాల్సి ఉందని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News