ఐఎన్ఎస్ రణ్వీర్ లో పేలుడు.. ముగ్గురి మృతి
ముంబయిలో విషాదం చోటు చేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్వీర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.;
ముంబయిలో విషాదం చోటు చేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్వీర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సిబ్బంది మరణించారు. మరో పదకొండు మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదానికి....
కాగా రణ్‌వీర్ లో ప్రమాదానికి కల కారణాలు తెలియరాలేదు. లోపల కంపార్ట్ మెంట్ లో పేలుడు సంభవించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఐఎన్ఎస్ రణ్‌వీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంది. దీనిపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.