భారత రక్షణ దళాలకు దొరికిన ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులు.. వారెంత డేంజరంటే..!
జమ్మూ కశ్మీర్ లో భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక 'హైబ్రిడ్' ఉగ్రవాదులని తెలుస్తోంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్ లో భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక 'హైబ్రిడ్' ఉగ్రవాదులని తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా వీరిని శ్రీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 'హైబ్రిడ్' మిలిటెంట్‌లు చాలా డేంజర్ అని అధికారులు చెబుతూ ఉంటారు. వీరు సాధారణ తీవ్రవాదుల లాగా ఉండరు.. ప్రజల్లోనే ఉంటారు. ఎప్పుడైతే ఆదేశాలు వస్తాయో.. అప్పుడు ఉగ్ర దాడులను నిర్వహించి, ఆపై సాధారణ జీవితాలను గడుపుతూ ఉంటారు.
"శ్రీనగర్ పోలీసులు నిషేధిత తీవ్రవాద సంస్థ LeT/TRFకి చెందిన ఇద్దరు స్థానిక హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 15 పిస్టల్స్, 30 మ్యాగజైన్లు, 300 రౌండ్లు మరియు ఒక సైలెన్సర్‌తో సహా నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు," కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ట్విట్టర్ లో తెలిపారు. TRF లేదా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది LeT శాఖ. అందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది పోలీసుల గొప్ప విజయం అని ఐజిపి అన్నారు.