విమానం కాక్‌పిట్‌లో కజ్జికాయలు తిన్న పైలట్లు.. యాజమాన్యం సీరియస్
కానీ స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా కాక్ పిట్ లో స్వీట్లు తిని, కూల్ డ్రింక్స్ తాగిన ఘటన..
సాధారణంగా విమానంలోకి తినుబండారాలు తీసుకెళ్లకూడదన్న నిషేధం ఉంది. ముఖ్యంగా సిబ్బందికి ఈ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. కానీ స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా కాక్ పిట్ లో స్వీట్లు తిని, కూల్ డ్రింక్స్ తాగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో యాజమాన్యం సదరు పైలట్లపై చర్యలకు ఉపక్రమించింది. కాక్‌పిట్‌లో స్వీట్లు తిన్న ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించింది.
ఇటీవల హోలీ సందర్భంగా ఆ ఇద్దరు పైలట్లు కాక్ పిట్‌లోకి కూల్‌డ్రింక్ గ్లాసులు తీసుకెళ్లారని, స్వీట్లు తిన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి గువహటీకి వెళ్లే విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పైలట్లపై సీరియస్ అయిన యాజమాన్యం వారిని రోస్టర్ నుంచి తొలగిస్తూ విధులకు దూరం చేసింది. పైలట్లపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పందించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.