బ్రిటన్ హోంమంత్రి ఆస్తులు భారత్ లో ఆక్రమణ

యూకే మంత్రి సుయెలా బ్రావెర్మన్ బంధువుల ఆస్తులను భారత్ లో కొందరు ఆక్రమించారు

Update: 2022-09-10 14:34 GMT

యూకే మంత్రి సుయెలా బ్రావెర్మన్ బంధువుల ఆస్తులను భారత్ లో కొందరు ఆక్రమించారు. గోవాలో ఉన్న తమ ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని సుయెలా బ్రావెర్మన్ తండ్రి ఫెర్నాండజ్ గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కుటుంబానికి ఉత్తర గోవాలోని అనగావ్ గ్రామంలో రెండు ప్లాట్లు ఉన్నాయన్నారు. వీటి విస్తీర్ణం 13,900 చదరపు మీటర్లు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలంలో ఉన్న రెండు ప్లాట్లను కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎంకు ఫిర్యాదు....
పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. జులై 27న దీనికి శ్రీకారం చుట్టారని, తనకు ఆగస్టులో ఈ విష‍యం తెలిసిందని ఫెర్నాండజ్ పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదుతో పాటు ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి,, రాష్ట్ర డీజీపీలకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇటీవలే సుయెలా బ్రావెర్మన్ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు.


Tags:    

Similar News