Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేసినట్లే.. ఈ స్థాయిలో హిస్టరీ వేరెవరికీ లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఆరుసార్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టి మహిళ ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ మరో రికార్డు కూడా అధిగమించనున్నారు. ఏడోసారి ఆమె బడ్జెట్ ను లోక్‌సభలో వరసగా ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆరుసార్లు మురార్జీ దేశాయ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును కూడా బ్రేక్ చేయనున్నారు.
ఈ సమావేశాల్లో...
కొత్తగా ఏర్పడిన లోక్‌సభ సమాశాలు ఈ నెల 24 నుంచి జులై 3వ తేదీ వరకూ జరగనున్నాయి. ఇప్పటికే దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.ఈ సమావేశాల్లో కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక వరకే పరిమితమవుతుందని చెబుతున్నారు. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు ఉండటంతో ఈ సమయంలో పూర్తి స్థాయి బడ్డెట్ ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఎంతమాత్రం ఉండదని అధికారిక వర్గాలు తెలిపాయి.
వర్షాకాల సమావేశంలో...
అయితే అదే సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రిగా ఏడోసారి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి అన్ని రికార్డులను తుడిచేయనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దానిపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో నిర్మలమ్మ కు అరుదైన అవకాశమనే చెప్పాలి.