Union Budget : పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు;

Update: 2024-02-01 04:55 GMT
Union Budget : పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్
  • whatsapp icon

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయయం పదకొండు గంటలకు ఆమె సభ ముందు బడ్జెట్ ను ఉంచుతారు. దీనికి ముందుగా ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి బయలుదేరిన నిర్మలా సీతారామన్ తొలుత రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పించడానికి అనుమతి తీసుకున్నారు.

మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత...
అక్కడి నుంచి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం కేంద్ర బడ్జెట్ ను ఆమోదించనుంది. ఈ సమావేశానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. మరి కాసేపట్లో ఆరోసారి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.


Tags:    

Similar News