ఎగ్జామ్ పేపర్ లీక్.. ఆ జిల్లాల్లో ఇంటర్ పరీక్షలు రద్దు

ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీకవ్వడంతో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Update: 2022-03-31 10:42 GMT

బల్లియా : ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీకవ్వడంతో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. యూపీలోని బల్లియా జిల్లాలో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లీకైంది. దాంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ను మార్కెట్లో రూ.500 కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీనిపై విచారణ చేసిన జిల్లా మెజిస్ట్రేట్.. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేశారు.

పేపర్ లీక్ నివేదిక అనంతరం యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ పేపర్‌ లీక్‌ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మాధ్యమిక విద్య ఇన్‌ఛార్జ్ మంత్రి గులాబ్ దేవి మాట్లాడుతూ.. "బల్లియాలో 12వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని పేర్కొన్నారు.


Tags:    

Similar News