మద్యం ప్రియులకు షాక్

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది

Update: 2023-04-03 06:59 GMT

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త మద్యం పాలసీకి ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించే విధంగా మద్యం పాలసీని కొత్తగా రూపొందించారు. లైసెన్సు ఫీజులను పది శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీకి...
ఈ మేరకు యోగి ఆదిత్యనాధ్ మంత్రివర్గం ఈ ఏడాది జనవరిలోనే కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ నెల 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. బీరు, మోడల్ షాపుల లైసెన్స్ ఫీజను కూడా పది శాతం పెంచడంతో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మద్యం బాటిల్‌పై ఐదు రూపాయలు, విదేశీ మద్యం సీసాపై పది రూపాయలు, బీరుపై ఐదు నుంచి ఏడు రూపాయల వరకూ పెరిగాయి.


Tags:    

Similar News