జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్, చైనాలకు సంబంధించిన ఆయుధాలు స్వాధీనం
ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరీలోని హత్ లంగా సెక్టార్లో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో..;
జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల ప్రణాళికలను భారత సైన్యం తిప్పికొట్టింది. బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్లో ఉగ్రవాదుల భారీ డంప్ ను సైనయం స్వాధీనం చేసుకుంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరీలోని హత్ లంగా సెక్టార్లో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో శనివారం ఉగ్రవాదుల భారీ డంప్ లభ్యమైందని భద్రతా దళాలు తెలిపాయి. అందుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించాయి. ఈ తనిఖీల్లో 8 AK-74U రైఫిళ్లు, 24 AK-74 మ్యాగజైన్స్, 12 చైనీస్ పిస్టల్, 24 పిస్టల్ మ్యాగజైన్లు, 9 చైనీస్ గ్రెనేడ్లు, 5 పాక్ గ్రెనేడ్లు, 5 గోధుమ సంచులు, 81 పాక్ బెలూన్లు, 560 రౌండ్ల ఎకె-47, 244 పిస్టల్స్ బుల్లెట్లు, పాక్ జెండాలు, బెలూన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ డంప్ లో పాకిస్థాన్ తో పాటు చైనాకు చెందిన పిస్టల్స్ లభ్యమవడం కలకలం రేపింది.