కేరళలో నోరో వైరస్ కలకలం
కేరళను వైరస్ వణికిస్తున్నాయి. ఏవైరస్ వచ్చినా ముందుగా కేరళలోనే బయటపడుతుంది. తాజాగా కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతుంది
కేరళను వైరస్ లు పట్టి పీడిస్తున్నాయి. ఏవైరస్ వచ్చినా ముందుగా కేరళలోనే బయటపడుతుంది. తాజాగా కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతుంది. కక్కనాడ్ పట్టణంలో 62 మది విద్యార్థులు వాంతులు, డయేరియా వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. ఈ విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. వీరందరికీ నోరో వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
విద్యార్థులందరికీ...
ప్రయివేటు స్కూలులోని టాయలెట్లలో ఇన్‌ఫెక్షన్ కారణంగానే ఈ వైరస్ సోకిందని భావిస్తున్నారు. దీంతో పాఠశాల పరిసరాలన్నింటినీ శుభ్రం చేశారు. డయేరియా, వాంతులు, స్వల్పంగా జ్వరంగా, తలనొప్పి, ఒళ్లునొప్పులతో విద్యార్థులు బాధపడుతున్నారు. ఇవన్నీ నోరోవైరస్ లక్షణాలేనని వైద్యులు చెబుతున్నారు. కలుషితమైన నీరు, ఆహారం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ అని నిర్ధారణ కావడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయింది.