మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిని తేల్చేది మనోడే

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తుంది. ఇంత వరకూ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని నిర్ణయించలేదు

Update: 2023-12-08 13:26 GMT

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తుంది. ఇంత వరకూ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని నిర్ణయించలేదు. దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ అగ్రనేతలున్నట్లు సమాచారం. అందుకోసం అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తుంది. రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.

రాజ్యసభ పభ్యుడు...
అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని తేల్చాలని నిర్ణయించింది. ఇందుకోసం పరిశీలకులను నియమించింది. తెలంగాణ నేత, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ను పరిశీలకుడిగా నియమించింది. సీఎం ఎంపిక ను దగ్గరుండి చూడాలని ఆదేశించింది. దీంతో వెంటనే లక్ష్మణ్ బయలుదేరి వెళ్లారు. మరికొద్ది గంటల్లోనే సీఎం ఎవరనేది క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.


Tags:    

Similar News