మమతకు షాకిచ్చిన ఈడీ
బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఈడీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఆమె మంత్రివర్గ సహచరుడిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఆమె మంత్రివర్గ సహచరుడిని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎస్ఎస్‌సి కుంభకోణం కేసులో మంత్రిని ప్రధాన నిందితుడిగా ఈడీ అధికారులు గుర్తించారు. ఆయన సన్నిహితురాలైన అర్పిత ఇంట్లో ఇరవై కోట్ల రూపాయల నగదు దొరకడంతో ఛటర్జీని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
స్కామ్ లు బయటపెట్టేందుకు...
మమత బెనర్జీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమె ప్రభుత్వంపై దాడులు తీవ్రతరం చేసింది. వివిధ కుంభకోణాలు జరిగాయని ప్రజల ముందుకు తెచ్చేందుకు ఈడీ దాడులు చేస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అర్పిత ఆయన బినామీగా గుర్తించిన అధికారులు మంత్రి పార్థ్ ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఎస్ఎస్‌సీ కుంభకోణం కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశముంది.