కళ్లు చెదిరిపోయేలా 123 ఎకరాల్లో జీ 20 మండపం.. ప్రత్యేకత ఏమిటి?

ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే. దేశాధినేతలు, ముఖ్యఅతిధులతో ఢిల్లీ నగరం వెలుగొంతుతోంది. శని,ఆదివారాల పాటు దేశ..

Update: 2023-09-08 04:15 GMT

ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే. దేశాధినేతలు, ముఖ్యఅతిధులతో ఢిల్లీ నగరం వెలుగొంతుతోంది. శని,ఆదివారాల పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు దేశ విదేశాల ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేయనున్నార. అందుకే వారి బస ఏర్పాట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. అగ్రరాజ్యాల నుంచి అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే జీ20 సమావేశ మందిరం అంటే ఓ రేంజ్‌లో ఉండాలి కదా.. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో భారత మండపం సిద్ధమైంది. ఈ మండపంలో ప్రత్యేకత చూస్తే అంతా ఇంతా కాదండోయ్‌.. ఎక్కడ చూసిన ఔరా అనిపించేలా ఉంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మండపం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జీ-20 ముఖ్యవేదికను ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ఏర్పాటు చేశారు. మన సంస్కృతి కళావైభవం ఉట్టిపడేలా భారత్‌ మండపాన్ని తీర్చిదిద్దారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ వైభవ చిహ్నాలను అమర్చారు. సాంస్కృతిక వైభవంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అధునాతన సౌకర్యాలతో భారత్‌మండపం సిద్ధం చేశారు.

మండపం ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఈ మండపం సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద మీటింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేసింది కేంద్ర సర్కార్‌. సుమారు 3వేల కోట్లు ఖర్చులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మండపంలో ఉన్న మల్టీపర్పస్ హాల్, ప్లీనరీ హాల్‌లో 7000 మంది కూర్చునే డిజైన్‌ చేశారు. ఈ హాల్ ఆస్ట్రేలియాలోని పాపులర్ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ. అంతే కాకుండా ఆధునిక సౌకర్యాలతో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు ఇంకా ఆడిటోరియాలు కూడా ఉన్నాయి. మండపం మందున్న 25 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఎవరెవరు బస చేయనున్నారు..?

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ దగ్గర నుంచి.. జీ20లో సభ్యులుగా ఉన్న అన్ని దేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. దేశవిదేశాల నుంచి వేలాది మంది అతిథులు హస్తిన వీధుల్లోకి రాబోతున్నారు. వీళ్లందరి కోసం దేశరాజధానిలోని ప్రముఖ హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేసింది కేంద్రం. భారత్‌ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షులు జో బైడెస్‌ ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. జోబైడెన్‌తో పాటు పలువురు దేశాధినేతలు ఈ రోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. వారి కోసం ఎయిర్ పోర్టులో ప్రత్యేక రన్‌వేను సిద్దం చేశారు. వారి విమానాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రన్‌వేపై ఇతరర విమానాలు ల్యాండ్‌ కాకుండా చర్యలు చేపట్టారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌ భారత్‌లో చేపడుతున్న తొలి అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఢిల్లీలోని షంగ్రిలా హోటల్‌లో ఉంటారు.

చైనా ప్రధాని హాజరు

ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులు.. చైనా ప్రధాని లీ-కీయాంగ్‌ G-20 సదస్సుకు హాజరుకానున్నారు. చైనా ప్రతినిధుల బృందం ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌లో బస చేయనున్నారు. ఆసియాన్ సదస్సులో పాల్గొని జకార్తా నుంచి శనివారం నేరుగా ఇండియాకు రానున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు. ఆయన ఢిల్లీలోని లలిత్‌ హోట్‌లో బస చేస్తారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌ వస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ ఢిల్లీలోని ఇంపీరియల్‌ హోటల్‌లో ఉంటారు.

లాక్‌డౌన్‌లోకి ఢిల్లీ..

ఇక జీ 20 సమాశాల సందర్భంగా ఢిల్లీ నగరం పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. భద్రత బలగాలు వారీ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎటు చూసిన పటిష్ట భద్రతతో ఉండిపోయింది. లక్షమంది భద్రతా సిబ్బంది డేగ కళ్లతో ఢిల్లీని కాపలా కాస్తున్నారు. 24/7 కంటి మీద రెప్ప వేయకుండా పారాహుషార్‌ అంటున్నారు. ఇక డాగ్‌ స్క్వాడ్లు, బాంబు స్క్వాడ్లను రంగంలోకి దింపి దేశ రాజధానిని అణువణువు జల్లెడ పడుతున్నారు. చిన్న ఈగ వాలినా గుర్తించేలా భద్రత బలగాలు ప్రత్యేక టెక్నాలజీతో ఢిల్లీ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
Tags:    

Similar News