వారు వస్తారా ..? రారా.. ?? ముస్తాబైన ఢిల్లీ.. భద్రత కట్టుదిట్టం..
జీ20 సదస్సుకు భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికాతోసహా 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక పైకి వస్తున్నాయి
వారు వస్తారా ..? రారా.. ??
ముస్తాబైన ఢిల్లీ.. భద్రత కట్టుదిట్టం..
జీ20 సదస్సుకు భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికాతోసహా 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక పైకి వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెప్టెంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు చర్చించనున్నారు.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జీ 20 సదస్సుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారమే ఢిల్లీకి రావాలి.. అయితే బైడెన్ సతీమణికి కరోనా సోకడంతో.. ఆయన రాకపై కాస్త అనుమానాలు నెలకొన్నాయి.. మరోవైపు చైనా అధినేత జిన్‌పింగ్ కూడా సదస్సుకు డుమ్మా కొట్టారు..చైనా ప్రధాని రాబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ కూడా రాలేకపోతున్నారు. మిగిలిన దేశాధినేతలంతా దేశరాజధానికి వస్తున్నారు.. ఈ వేదిక నుంచి ప్రధాని మోడీ..ఒకే వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత నినాదాన్ని సదస్సులో భారత్ మూలమంత్రంగా వినిపించనున్నారు..సదస్సుకు వచ్చే ప్రతి దేశాధినేతకు భారత్ మండపం వద్ద సంప్రదాయ రీతులతో ఘనస్వాగతం పలకనున్నారు.
జీ 20 సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబైంది.. జీ 20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్.. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈనెల 9,10 తేదీల్లో జీ-20 సమావేశాలు జరుగుతాయి. 20 దేశాధినేతల రాక సందర్భంగా ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. సదస్సు ఏర్పాట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సారథ్యంలో జరుగుతున్నాయి..
28 అడుగుల ‘నటరాజ’ విగ్రహం
ఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ వేదికగా భారత్ మండపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా భావించే 28 అడుగుల ‘నటరాజ’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పద్దెనిమిది మంది చేత నిర్మించబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం భారత మండపం వద్ద ఉన్న సమావేశ మందిరం ప్రవేశ ద్వారం వద్ద ఉంది. ఈ విగ్రహం శివుడిని ‘లార్డ్ ఆఫ్ డ్యాన్స్’గా అతని సృష్టి, స్థితి, లయగా సూచిస్తోంది.