పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వ తేదీన ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఉదయం పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.;

Update: 2021-12-01 06:36 GMT

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వ తేదీన ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఉదయం పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు.

మంటలు అదుపులోకి....
పార్లమెంటు సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రతిరోజూ ప్రారంభమవుతాయి. అయితే ఎనిమిది గంటలకే అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు.


Tags:    

Similar News