సిసోడియా తర్వాత ఎవరు?
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తదుపరి అరెస్ట్ ఎవరనే చర్చ జరుగుతుంది
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తదుపరి అరెస్ట్ ఎవరనే చర్చ జరుగుతుంది. నిన్న సాయంత్రం మనీష్ సిసోసిడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి పలువురు వ్యాపారులు, రాజకీయ వేత్తలు అరెస్టయ్యారు. తాజాగా మనీష్ సిసోడియా అరెస్ట్ తో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు బయలుదేరాయి.
రాజకీయ వర్గాల్లో...
తదుపరి అరెస్ట్ ఎవరు అన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి అరెస్ట్‌లు ఉంటాయన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతుంది. అనేక పేర్లు వినపడుతుండటంతో పొలిటికల్ పార్టీల్లో కొంత అలజడి కనిపిస్తుంది. అయితే సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోసిడియా అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు. ఇది రాజకీయ కక్ష అని ఆయన పేర్కొన్నారు.
దుర్మార్గం : కేజ్రీవాల్
అమాయకుడైన మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం దుష్టరాజకీయమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పటికైనా ప్రజాగ్రహం చూడక తప్పదని ఆయన హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల్లో పలుచన చేయడానికే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. ఆప్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వ లేక అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దర్యాప్తు సంస్థల పనితీరు ఎలా ఉందో అందరికీ తెలుసునని అన్న ఆయన ఎప్పటికైనా గుణపాఠం పాలకులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.