ఎండల దెబ్బకు ఐదు రోజుల సెలవులు
మండిపోతున్న ఎండలతో ఒడిశా ప్రభుత్వం పాఠశాలలకు ఐదు రోజులు సెలవు దినాలు ప్రకటించింది
మండిపోతున్న ఎండలతో ప్రభుత్వపాఠశాలలకు ఐదు రోజులు ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించింది ఒడిశాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భువనేశ్వర్ నగరంలో 40 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అధిక ఉష్ణోగ్రతలతో...
బారిపద నగరంలో ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్షియస్, జార్సుగూడలో 41.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రభుతం వెంటనే చర్యలకు దిగింది. మండుతున్న ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ఒడిశా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.