బిల్లు ఆమోదం : ఆ ఇద్దరు మినహా

లోక్‌సభలో మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఎన్నడూ లేని విధంగా బిల్లు అత్యధిక మెజారిటీతో సభ ఆమోదం పొందింది

Update: 2023-09-20 14:52 GMT

లోక్‌సభలో మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఎన్నడూ లేని విధంగా నారీ శక్తి వందన్ బిల్లు అత్యధిక మెజారిటీతో సభ ఆమోదం పొందింది. మహిళ రిజర్వేషన్ల పట్ల రాజకీయ పార్టీలకున్న గౌరవంగానే దీనిని చూడాల్సి ఉంది. ఎంఐఎం సభ్యులు ఇద్దరు మినహా మిగిలిన సభ్యులందరరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళ రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఆమోదం పొందిన బిల్లుగా మహిళ రిజర్వేషన్ బిల్లు నిలిచింది.

అత్యధిక మెజారిటీతో...
మహిళ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 454 పార్లమెంటు సభ్యులు ఓటింగ్ వేయగా కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. వారిద్దరూ ఎంఐఎం ఎంపీలుగా చెబుతున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించిన నేపథ్యంలో వారు మినహా మిగిలిన అందరూ ఓటు వేసి బిల్లుకు తమ మద్దతు తెలిపారు. మాన్యువల్ పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించగా ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించడం విశేషం.


Tags:    

Similar News