కేసీఆర్ కు పవార్ ఫోన్.. సిన్హాకే మద్దతు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి.

Update: 2022-06-21 11:40 GMT

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. విపక్షాలకు చెందిన 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎన్సీపీ అధినేత కేసీఆర్ కు ఫోన్ చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు కేసీఆర్ సమ్మతించినట్లు తెలిసింది. తాను కేసీఆర్ కు ఫోన్ చేయగా ఆయన ఖచ్చితంగా యశ్వంత్ సిన్హా కు మద్దతిస్తానని కేసీఆర్ చెప్పారని శరద్ పవార్ చెప్పారు.

22 పార్టీలు....
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ముగ్గురు పేర్లు సూచించినా వారెవ్వరూ పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దులా పేర్లను పరిశీలించారు. అయితే ముగ్గురు పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసేందుకు నిరాకరించడంతో యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ తో పాటు మరో 21 పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. రేపు ఆయన నామినేషన్ వేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News