Huzurabad : ఈటలకు అలా లబ్ది చేస్తున్నారా?
హుజూరాబాద్ ఎన్నిక సమీపిస్తుంది. అన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బీజేపీకి రాజకీయ లబ్ది [more]
;
హుజూరాబాద్ ఎన్నిక సమీపిస్తుంది. అన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బీజేపీకి రాజకీయ లబ్ది [more]
హుజూరాబాద్ ఎన్నిక సమీపిస్తుంది. అన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బీజేపీకి రాజకీయ లబ్ది చేకూరుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ అన్నది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ గట్టి అభ్యర్థిని పోటీకి దింపి ఉంటే అది బీజేపీ ఓట్లకు గండి పడే అవకాశముంది. అందుకే బల్మూరి వెంకట్ ను ప్రకటించిందంటున్నారు.
బీసీ సామాజికవర్గాన్ని….
హుజూరాబాద్ లో హోరాహోరీ తప్పదు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ముఖ్యమైన నేతలను పార్టీలో చేర్చుకని ఈటలకు షాక్ ఇచ్చింది. అయితే తనకు బలమైన బీసీ ఓటు బ్యాంకు అండగా నిలబడుతుందని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి బీసీ అయినప్పటికీ దళిత బంధు పథకం అమలుతో తమకు ఆ వర్గం మరింత చేరువయ్యే అవకాశాలున్నాయన్నది ఈటల అంచనా.
బలమైన నేత అయితే..?
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొండా సురేఖ వంటి నేతను పోటీకి దింపి ఉంటే ఈటల ఓటు బ్యాంకు కు చిల్లు పడేది. ఈటల రాజేందర్ ను గెలిపించాలన్నది విపక్షాల ఆలోచనగా కన్పిస్తుంది. అధికార పార్టీని ఈ ఉప ఎన్నికల్లో దెబ్బతీస్తే సాధారణ ఎన్నికల్లో మన పని మరింత సులువవుతుందన్నది కాంగ్రెస్ భావన. అందుకే ఎన్ఎస్క్ష్క్ష్యూఐ నేత బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపారు. యువకుడే అయినా రాజకీయంగా వెంకట్ ప్రభావం చూపలేని నేతగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అసంతృప్తి ఓట్లు చీలకుండా…
కాంగ్రెస్ ఎంపికతో తమకు మరింత లాభం చేకూరిందని బీజేపీ వర్గాలు సంబరపడుతున్నాయి. ఓట్ల చీలిక ఉండబోదని, ఈటలకు ఇటు రెడ్డి సామాజికవర్గం, అటు బీసీ సామాజికవర్గం అండగా ఉంటే గెలుపు సులువవుతుందని, కనీస ఓట్ల తేడాతోనైనా ఈటల రాజేందర్ బయటపడే అవకాశముందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి చీలకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉందంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.