జగన్… డేంజర్ లో పడినట్లేనా ?
పెడతాను అంటే ఎవరైనా వస్తారు, కొడతాను అంటే పారిపోతారు అన్నది ఒక సామెత. ఇపుడు జగన్ సంక్షేమ పధకాల పేరుతో బాగానే పెడుతున్నారు కాబట్టి జనాలు వస్తున్నారు. [more]
పెడతాను అంటే ఎవరైనా వస్తారు, కొడతాను అంటే పారిపోతారు అన్నది ఒక సామెత. ఇపుడు జగన్ సంక్షేమ పధకాల పేరుతో బాగానే పెడుతున్నారు కాబట్టి జనాలు వస్తున్నారు. [more]
పెడతాను అంటే ఎవరైనా వస్తారు, కొడతాను అంటే పారిపోతారు అన్నది ఒక సామెత. ఇపుడు జగన్ సంక్షేమ పధకాల పేరుతో బాగానే పెడుతున్నారు కాబట్టి జనాలు వస్తున్నారు. కానీ అదే జగన్ సర్కార్ ధరల బాదుడుతో కొడుతోంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వారు అన్నారని కాదు కానీ గత కొంతకాలంగా నిత్యావసరాల ధరలు ఏపీలో దారుణంగా మండిపోతున్నాయి. ఒక నివేదిక ప్రకారం చూస్తే ఏకంగా ఉన్నరేటుకు రెండు వందల శాతం పైగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ఏం కొనేటట్లు లేదు, తినేట్లులేదు అన్నట్లుగా సగటు జనం పరిస్థితి ఉంది.
పందేరాల తీపితో…
పధకాల తీపితో ఈ మంటను ఓర్చుకోమంటే జరిగే పనేనా అన్నది జనం మాటగా ఉంది. ఒక వైపు నగదు బదిలీ పధకం రంజుగా సాగుతోంది. బాగానే ఎక్కడికక్కడ కాసులు కురిపిస్తున్నారు. వారూ వీరూ అని చూడకుండా పేదవాడి బ్యాంక్ ఖాతాలో కరెన్సీ గలగలలు సందడి చేస్తున్నాయి. కానీ తీరా ఆ సొమ్ముతో సంచి పట్టుకుని బజారుకు వెళ్తే బేజారే అన్నట్లుగా అక్కడ సీన్ ఉంది. వంట నూనెల నుంచి పప్పు దినుసులు, ఇతర ఆహారా పదార్ధాల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. దాంతో వేలకు వేలు జగన్ ఇస్తున్నాడు అన్న మాటే కానీ దాంతో సంచీకి సరిపడా సరుకులే రావడం లేదు అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు చెప్పిన మాట ….?
ఇలా ధరలు చుక్కలు అంటడానికి కరోనా మహమ్మారి ప్రధాన కారణం. దానితో పాటు బాగా పెరిగిన ఇంధన ధరలు కూడా కారణం. పెట్రోల్ ధర లీటర్ చూస్తే ఏపీలో సెంచరీ దాటేసింది. కేంద్రం అలా ప్రతీ రోజూ పెంచుకుంటూనే పోతోంది. మీకేమైనా నొప్పిగా ఉంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయపు వాటా నుంచి తగ్గించుకుని ధరలను నియంత్రించుకోవాలని కేంద్ర పెద్దలు ఏనాడో ఉచిత సలహా ఇచ్చేశారు. ఇక జగన్ కూడా విపక్షంలో ఉన్నపుడు కేంద్రం పెట్రోల్ ధరలు పెంచితే ఏపీ సర్కార్ తగ్గించవచ్చు కదా అని డిమాండ్ చేశారు. నేడు ఆ వీడియో క్లిప్పింగ్స్ నే ముందు పెట్టి టీడీపీ నేతలు ఆయన్ని కార్నర్ చేస్తున్నారు.
అలా అయితే వ్యతిరేకతే…?
ఒక వైపు పంచుడు కార్యక్రమం దివ్యంగా సాగిపోతోంది. అదే తీరున ధరల దంచుడు కూడా గట్టిగానే ఉంది. దీంతో జనాలకు పెరుగుతున్న ధరలే మంటెక్కిస్తాయని ఆర్ధిక నిపుణులు కూడా అంటున్నారు. పంచుడు ప్రోగ్రాంలో వైసీపీకి నూరు మార్కులు పడుతున్నా ధరల దెబ్బ మాత్రం మొత్తం క్రెడిట్ ని లాగేస్తుంది అని అంటున్నారు. జగన్ ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టాలని, అపుడే ఆయన నగదు బదిలీ పధకానికి అసలైన న్యాయం జరుగుతుందని, జగన్ ఇచ్చే ప్రతీ రూపాయికీ నిజ విలువ కూడా అలా నిలుస్తుందని అంటున్నారు. అయితే కరోనా కష్టాలతో ఏపీ ఖజానాకు కాసులు సరిగ్గా చేరడం లేదు. ఇక ఏ ప్రభుత్వానికైనా పెట్రోల్, మద్యం నుంచే భారీగా ఆదాయం వస్తుంది దాన్ని వదిలేసుకోవడమంటే నేల విడిచి సాము చేయడమే. పైగా లెక్కలు మిక్కిలిగా పధకాలను జగన్ ఏపీలో ప్రకటించేశారు. వాటి కోసం ఈ బాదుడు తప్పడంలేదు అంటున్నారు. అయితే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకునే తీరు ఎప్పటికైనా జగన్ సర్కార్ కి మైనస్ అవుతుంది అన్న విపక్షాల మాట నిజమైతే మాత్రం డేంజర్ లో పడ్డట్లే.