రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Update: 2016-12-25 16:10 GMT

పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధాని మోదీ 50 రోజుల్లో సామాన్యుల కష్టాలు తీరతాయని చెప్పారు. 50 రోజులకు మరో రెండు రోజలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికీ ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. బ్యాంకుల వద్ద నో క్యాప్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ బ్యాంకులు తెరుచుకున్నా సామాన్యులకు సరిపడా నోట్లు బ్యాంకుల వద్ద లేవని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ వాగ్దానం నెరవేరుతుందా? అనేది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న. ఎంతకాలం ఈ కరెన్సీ కష్టాలని క్యూలో నిలబడిన సామాన్యుడి నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 46 రోజుల నుంచి ఎన్నో మార్పులు చేసుకొస్తూ వస్తోంది. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 68 మార్పులు చేసింది. కొత్త నిబందనలనను తీసకొచ్చింది. తీసుకొచ్చిన నిబంధనలను మార్చేసింది. రాత్రికి విధించిని నిబంధన తెల్లారేసరికి మారిపోతోంది. ఎన్నో సవరణలు తెచ్చారు. ఎన్నో చట్టాలను మార్చారు. ఆర్బీఐ రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక చట్టం తేవడం...మళ్లీ దాన్ని మార్చడం ఆర్బీఐకి అలవాటుగా మారింది.

నల్లధనం ఎక్కడ.

ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం పోయింది. 46 రోజల్లో జరగనది...మూడురోజుల్లో అద్భుతాలు జరుగుతాయా? అన్నది ప్రశ్న. నల్లకుబేరులను ఆటకట్టిస్తానన్న మోదీ వారి సంగతి పక్కన బెడితే....సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. లక్షల కోట్లు ప్రభుత్వ ఖజనాలో వచ్చి పడతాయన్న మోదీ టీం ఆలోచనలు ఆచరణలో ఫలించలేదు. ఇప్పటికే 14 లక్షల కోట్లు పాతనోట్లు వచ్చి చేరాయి. మిగిలింది 2 లక్షల కోట్లు మాత్రమే.. అడపా...దడపా...ఐటీ దాడుల్లో కొత్త కరెన్సీ నోట్లు దొరుకుతున్నా అవి నల్లకుబేరులు బ్లాక్ ను వైట్ గా మార్చినవే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలుచెయ్యడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైనట్లేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. నల్లధనాన్ని వెలికితీసే మాట ఎలా ఉన్నా....కొత్త కరెన్సీ నోటు దొరకటం సామాన్యుడి కి కష్టంగా మారింది.

చేతలేవీ.....

మోదీ మాటలకు...చేతలకు...పొంతన లేకుండా ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కాషాయ టీం మాత్రం సోషల్ మీడియాలో మోదీకి అనుకూలంగా పోస్టింగ్ లు పెడుతున్నారు. కాని వాస్తవ పరిస్థితి చూస్తే కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రజావసరాలకు అనుగుణంగా కరెన్సీ ముద్రణ జరగడం లేదు. ముఖ్యంగా 500ల నోట్ల ముద్రణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. వంద, యాభై నోట్లు మార్కెట్లోకి ఇంతవరకూ రాలేదు. కేవలం రెండు వేల నోట్లు మాత్రమే ఏటిఎంలోనైనా, బ్యాంకుల్లోనైనా దొరుకుతున్నాయి. రెండు వేల నోటుకు చిల్లర దొరకక...సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ ప్రయోగం వికటించిందనే విమర్శలు ఎదొర్కొంటున్నారు. మరో రెండు రోజులు మాత్రమే మోడీ చెప్పిన సమయానికి గడువు ఉంది. ఈ లోపు ఏటీఎంల నిండా కరెన్సీ నోట్లు ఉంటాయని ఆశిద్దాం

Similar News