పవన్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్న బీజేపీ ?
ఎన్డీయే సమావేశానికి జనసేన హాజరు కావడం జనసైనికులకు ఆనందాన్ని కలిగించే ఆసక్తికరమైన పరిణామాన్ని అందించింది.
2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు మందుకు వేస్తున్న జనసేన , బీజేపీలు పొత్తుతో ముందుకు వెళ్లబోతున్నాయి. ఇటీవల ఎన్డీయే సమావేశానికి జనసేన హాజరు కావడం జనసైనికులకు ఆనందాన్ని కలిగించే ఆసక్తికరమైన పరిణామాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించే ప్లాన్ లో ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే బీజేపీ నుంచి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే జనసేనతో పొత్తుకు టీడీపీకి శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్టేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ ను టీడీపీకి దూరం చేసి సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలనే లక్ష్యంతో బీజేపీ భిన్నమైన ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్, చంద్రబాబులకు ధీటుగా పవన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికేనన్న టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశం అనంతరం పవన్ కోరుకుంటున్న రూట్ మ్యాప్ తో పాటు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పెద్దలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేనలు గెలుపుపై దిశా నిర్దేశం చేసిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించి, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే తప్ప, ఆ పార్టీలో తిరుగుబాటుకు దారితీసే అవకాశం ఉండదు. మరోవైపు 2024 ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేదు. ప్రధానంగా టీడీపీ వద్ద ఉన్న ఓటు బ్యాంకు క్రమేపీ బీజేపీ, జనసేనల వైపు మళ్లాలన్నదే బీజేపీ జాతీయ పెద్దల అభిలాషగా కనిపిస్తోంది. అందుకే ఇటీవల ఎన్డీఏ సమావేశానికి టీడీపీని పక్కన పెట్టి పవన్‌ని మాత్రమే ఆహ్వానించారని, దీని వెనక అతిపెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాల్సి.