నాగార్జునకొండ సందర్శించిన అమెరికా బౌద్ధ పరిశోధకులు

అక్క ప్రపంచంలోనే రెండో ఆర్కలాజికల్ ఐలాండ్ మ్యూజియం అయిన నాగార్జున కొండను అమెరికాలో స్థిరపడి బౌద్ధం పై పరిశోధనలు చేస్తున్న ప్రవసి భారతీయులు భాస్కర్, తలాటం శ్రీ నగేష్ లు బౌద్ధ కేంద్రాల సందర్శనలో భాగంగా ఆదివారం నాడు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.;

Update: 2023-12-10 17:20 GMT
Nagarjuna Museum, Buddha sculptures, American researchers, Buddha sculptures
  • whatsapp icon


అక్క ప్రపంచంలోనే రెండో ఆర్కలాజికల్ ఐలాండ్ మ్యూజియం అయిన నాగార్జున కొండను అమెరికాలో స్థిరపడి బౌద్ధం పై పరిశోధనలు చేస్తున్న ప్రవసి భారతీయులు భాస్కర్, తలాటం శ్రీ నగేష్ లు బౌద్ధ కేంద్రాల సందర్శనలో భాగంగా ఆదివారం నాడు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరికి నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమలహాసన్ స్వాగతం పలికిన అనంతరం మ్యూజియంలోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు ,పురావస్తు వస్తువుల గురించి, ఇక్ష్వాకుల కాలంలో శ్రీ పర్వత -విజయపురిగా పిలువబడిన నాగార్జున కొండ చారిత్రక విశేషాలను వివరించారు.
అనంతరం నాగార్జున కొండపై పునర్నిర్మించిన క్రీస్తు శకము 3 వ శతాబ్దం నాటి అశ్వమేధ యాగశాల, సింహల విహారము, మహాస్థూపము, చైత్యము, మద్యయుగపు జైన దేవాలయాలు, ఇనుప యుగపు సమాధి, రెడ్డి రాజులు నిర్మించిన కోట అవశేషాలను శివనాగిరెడ్డి వీరికి వివరించారు. నాగార్జున కొండకు సంబంధించిన బౌద్ధ శిల్పాలు న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శనలో ఉన్నాయని వాటిని తాము చూసిన తర్వాత నాగార్జున కోండని చూడాలనిపించి ఇక్కడకు వచ్చినట్లుగా మహాయాన బౌద్ధ పరిశోధకుడు భాస్కర్ ,జై న, బౌద్ధ పరిశోధకుడు తలాటం శ్రీ నగేష్ తెలిపారని శివనాగిరెడ్డి తెలిపారు .






 


 


Tags:    

Similar News