బండికళ్ల ప్రదీప్ నారాయణ్.. అద్భుతమైన ట్యాలెంట్
బండికళ్ల ప్రదీప్ నారాయణ్ వయసు చిన్నదే.. సాధిస్తోంది చాలానే;
బండికళ్ల ప్రదీప్ నారాయణ్ వయసు చిన్నదే.. సాధిస్తోంది చాలానే..! ఎందుకంటే అతడి మెమొరీ పవర్ అద్భుతం. కేవలం 1 సంవత్సరం, 11 నెలల వయస్సులో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన ప్రదీప్ నారాయణ్ లో అసాధారణమైన ప్రతిభ ఉందని ప్రపంచం గుర్తించింది. తెలివితేటలు, జ్ఞాపకశక్తి విషయంలో పిల్లాడు సూపర్ అని అంటున్నారు. అందుకే రికార్డులు కూడా ఆ పిల్లాడి సొంతం అవుతూ ఉన్నాయి. అతను జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, మానవ శరీర భాగాలు, గృహోపకరణాలతో సహా 150 పేర్లను గుర్తించగలిగే సామర్థ్యాన్ని 11 నిమిషాల్లోనే ప్రదర్శించాడు. ప్రదీప్ అసాధారణమైన ఫీట్ అతనికి ప్రతిష్టాత్మక ఇన్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా చేసింది. ప్రపంచంలోనే చెరగని ముద్ర వేసి రికార్డు సృష్టించిన యువ మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణ్‌ను పలువురు అభినందిస్తూ ఉన్నారు.