యంగిస్తాన్ ఫౌండేషన్: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుని రావడమే ముఖ్య లక్ష్యం

యంగిస్తాన్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాదీపం. 70,000 మంది యువత

Update: 2023-08-26 13:04 GMT

యంగిస్తాన్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాదీపం. 70,000 మంది యువత, 150+ ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌ల మద్దతుతో, ఈ స్వచ్ఛంద సంస్థ 60 నగరాల్లో 5 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఫౌండేషన్ విజయవంతంగా ఆరోగ్యం, జీవనోపాధి, లింగం, విద్య, వాతావరణం, పర్యావరణంపై దృష్టి సారించే 5 క్రియాశీల అంశాలపై దృష్టి పెట్టింది. ఇవన్నీ UN సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు)కి అనుగుణంగా ఉన్నాయి. ఫౌండేషన్ లో భాగంగా నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని అందించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, 60 నగరాల్లో 2 మిలియన్ల మందికి పైగా భోజనాలు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఆహారం, బట్టలు, ఆసుపత్రులలో వైద్యం, నిరాశ్రయులకు ఆశ్రయం వంటివి అందిస్తూ వస్తున్నారు. 2 మిలియన్ల మందికి పైగా భోజనం అందించారు. 3,000 మంది నిరాశ్రయులైన వ్యక్తులకు కౌన్సెలింగ్ అందించారు. జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


 ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయాన్ని అందించే లక్ష్యం నెరవేరుతూ ఉండగా..! స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారి సంఖ్య పెరగడంతో.. యంగిస్తాన్ విద్యా రంగంలోకి కూడా ప్రవేశించింది. పిల్లలకు సంరక్షణ కేంద్రాలు, మురికివాడలలోని పిల్లలకు ట్యూషన్‌ చెప్పడం వంటివి మొదలయ్యాయి. వెనుకబడిన కమ్యూనిటీలలో అక్షరాస్యతను మెరుగుపరచడం.. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా కార్యక్రమం అభివృద్ధి చేశారు. క్రమంగా ఫౌండేషన్ మహిళా సాధికారత, భద్రత, లింగ సమానత్వంతో సహా ఇతర రంగాలలోకి అడుగు పెట్టింది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, సేఫ్టీ సెషన్‌లలో వివిధ కార్యక్రమాల ద్వారా యంగిస్తాన్ మహిళలు, యుక్తవయస్కుల వారికి ఉపాధి రక్షణ కల్పిస్తుంది. యంగిస్తాన్ టీమ్ SHE టీమ్‌లతో అనుసంధానమైంది, LGBTQ+ కమ్యూనిటీకి కూడా తోడ్పాటును అందిస్తోంది. ఆడవారి ఆరోగ్యం, పిల్లల భద్రతకు సంబంధించి పలు కార్యక్రమాలను చేపట్టింది.


పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను అర్థం చేసుకుని, ఫౌండేషన్ వాతావరణ పరిరక్షణకు సంబంధించి కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి, కార్బన్ ఉద్ఘారాలను తగ్గించడానికి, అటవీ ప్రాంతాలను పరిరక్షించడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. యువత ఓటింగ్ వైపు దృష్టి పెట్టడం, ప్రజాస్వామ్యం గురించి అవగాహన, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఏమి చేయాలి అనే విషయాలపై ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. ఫౌండేషన్ డిజాస్టర్ రిలీఫ్ కు సంబంధించి.. 47 మంది యువకులకు శిక్షణను కూడా అందించింది. సంక్షోభ సమయంలో వేగంగా స్పందించడానికి వీలు అవుతుంది.


యంగిస్తాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  అరుణ్ డేనియల్ ఎల్లమటి కుమార్ ప్రయాణం ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన అరుణ్ కష్టాల్లో ఉన్న వాళ్లకు, నిరాశ్రయులైన వారికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రతికూల పరిస్థితులను ఎదురైనప్పుడు ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యం. నిరాశ్రయులైన వారికి భోజనం అందించడానికి సొంత డబ్బును ఖర్చు చేయడంతో మా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు ఓ గొప్ప సంస్థగా పరిణామం చెందింది." అని అన్నారు.

  యంగిస్తాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  అరుణ్ డేనియల్ ఎల్లమటి కుమార్ 

 



Similar News