India Vs Australia : నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో ఐదో టెస్ట్

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ ప్రారంభమయింది.;

Update: 2025-01-03 02:02 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ ప్రారంభమయింది. సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఎప్పటిలాగానే భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. కెప్టెన్ గా జస్ప్రిత్ బూమ్రా వ్యవహరిస్తున్నాడు.

మూడు వికెట్లు కోల్పోయి...
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ లు తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో ఒకటి భారత్ గెలవగా, మరొకటి డ్రాగా ముగిసింది. రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్ స్కోరు 2-1 గా ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లి క్రీజులో కొంత నిలకడగా ఆడుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ నామమాత్రమే అయినా భారత్ టాప్ ఆర్డర్ ఇలా లంచ్ బ్రేక్ కు కుప్పకూలిపోవడం షరా మామూలుగానే అనిపిస్తుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News