India : ఐదో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర ఓటమిని చవిచూసింది;

Update: 2025-01-05 03:44 GMT

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రిలియా ఈ సిరీస్ ను 3 - 1 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్ట్ లో భారత్ నిర్దేశించిన తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను మాత్రం భారత్ చేజార్చుకున్నట్లయింది. సిడ్నీ టెస్ట్ లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలయింది. దీంతో వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో చోటును మరింత క్లిష్టతరం చేసుకుంది.


ఆరు వికెట్ల తేడాతో...

భారత్ రెండో ఇన్నింగ్స్ లో 162 పరుగులు మాత్రమే చేయడంతో ఆస్ట్రేలియాకు ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాలేదు. బూమ్రా గాయపడటం కూడా ఒకింత ఓటమికి కారణంగా చెప్పాలి. ఈ సిరీస్ లో బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా, బ్యాటర్లు మాత్రం తడబడ్డారు. బ్యాటర్లు అతి తక్కువ పరుగులు చేయడం, త్వరగా అవుట్ అవ్వడం వంటి తప్పిదాల కారణంగానే ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను చేజార్చుకుందని చెప్పాలి. ఐదు టెస్ట్ ల సిరీస్ లో కేవలం ఒకటి మాత్రమే గెలిచి భారత్ ఇంటి దారి పట్టనుంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News