Australia vs India : ఇంకెందుకు భయ్యా.. అర్పించారుగా... ఫైనల్ ఛాన్స్ కూడా మిస్సయింది

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ లో ఇండియా పరాజయం పాలయింది

Update: 2024-12-30 07:49 GMT

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ లో ఇండియా పరాజయం పాలయింది. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా వెళ్లేలేదు. ఈ మ్యాచ్ ఫలిత తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాయింట్లు మరింత దిగజారాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ లో నేరుగా స్థానాన్ని సంపాదించుకుంది. రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత జట్లు పోటీపడగా మూడింటిలో భారత్ వైదొలగినట్లే.ఇప్పుడు శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. మెలబోర్న్ టెస్ట్ లో భారత బ్యాటర్లు విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడిచేసినప్పటికీ బ్యాటర్లు మాత్రం రాణించలేకపోయారు.

నామమాత్రమే...

మరో టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పటికీ అది నామామాత్రమే. గెలిచినా, ఓడినా పెద్దగా ప్రయోజనం లేదు. రికార్డుల్లో చూసుకోవడానికి తప్పించి దేనికీ పనికిరాదు. 340 పరుగుల లక్ష్యమున్నప్పటికీ కనీసం డ్రా చేయాలన్న ప్రయత్నంలో కూడా మనోళ్లు కనిపించలేదు. చేజేతులారా ఆటను సమర్పించుకున్నారు. కేవలం నిర్లక్ష్యంతో పాటు నిలకడలేని తనమే ఈ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ టీం ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఇకశ్రీలంక చేతిలోనే ఉంది. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అదే సమయంలో శ్రీలంక కు కూడా కొన్ని పాయింట్లు తగ్గితే అప్పుడు భారత్ కు అవకాశాలున్నాయంటున్నారు. శ్రీలంక - ఆస్ట్రేలియా మీద జరిగే సిరీస్ లో నెగ్గాల్సి ఉంటుంది.
సీనియర్లే కారణం...
అసలు ఈ దుస్థితికి రావడానికి కారణం సీనియర్లు అని చెప్పకతప్పదు. వారు ఇక పదవీ విరమణ చేస్తే మంచిదన్నసూచనలు రవిశాస్త్రి వంటి వారు కూడా చేస్తున్నారంటే వారి ఆటతీరు గురించివేరే చెప్పాల్సినపనిలేదు. సీనియర్లు నిలకడగా ఆడి ఉంటేఈరోజు ఈ ముప్పు తప్పేది. ఫామ్ కోల్పోయిన తర్వాత కూడా జట్టును పట్టుకుని వేలాడుతుండటం సరైన పద్ధతి కాదన్న కామెంట్స్ ఈ ఓటమి తర్వాత మరింత ఎక్కువయ్యాయి. సీనియర్లతో ఆడేకన్నా జూనియర్లతో ప్రయోగం చేసి ఓటమి పాలయినా ఇంతటి అవమానం భారత్ కు దక్కి ఉండేది కాదు. అలాగే సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ను దారుణంగా కోల్పోయిన తర్వాత కూడా వీరిని క్షమించి కొనసాగించడం అనవసరమన్న అభిప్రాయాలను క్రీడాపండితులు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News