గవాస్కర్ కు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి పాదాభివందనం
నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాలరెడ్డి సునీల్ గవాస్కర్ కు పాదాభి వందనం చేశాారు
ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం ఇంకా ఆనందం నుంచి తేరుకోలేదు. కుమారుడి సెంచరీ విన్యాసాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఆనందభాష్పాలు రాల్చారు. డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన వెంటనే నితీష్ ను ఆలింగనం చేసుకుని కన్నీటిపర్యంత మయ్యారు. అయితే ఇదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాలరెడ్డి సునీల్ గవాస్కర్ కు పాదాభి వందనం చేసిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆట ప్రారంభానికి ముందు...
ఈరోజు ఆట ప్రారంభానికి ముందు గవస్కర్ తో పాటు రవిశాస్త్రిని నితీష్ కుమార్ కుటుంబం కలిసింది. ఈ సందర్బంగా గవాస్కర్ కు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాలరెడ్డి ఆయన సతీమణి పాదాభివందనం చేశారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరారు. ఇది చూసిన గవాస్కర్ చలించిపోయారు. వారిస్తూ అలా చూస్తూకాసేపు ఉండిపోయారు. అయితే ఇది చూసిన కామెంటేటర్స్ మార్క్ నికోలస్, జస్టిన్ లాంగర్ లు భారతీయ సంప్రదాయం ఇదేనంటూ అంటూ ప్రశంసించడం ఆకట్టుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now