Virat Kohli : విరాట్ కోహ్లి న్యూ ఇయర్ వేడుకలను ఇలా జరుపుకున్నారే?

భారత క్రికెటర్ విరాట్ కోహ్లి న్యూ ఇయర్ వేడుకలను ఆస్ట్రేలియాలో జరుపుకున్నాడు

Update: 2025-01-01 05:52 GMT

భారత క్రికెటర్ విరాట్ కోహ్లి న్యూ ఇయర్ వేడుకలను ఆస్ట్రేలియాలో జరుపుకున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలసి సిడ్నీలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ కోసం ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాలో నేపథ్యంలో ఐదో టెస్ట్ కోసం టీమిండియా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకుంది. భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి సిడ్నీ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇద్దరూ కలసి...
స్టార్ క‌పుల్ న్యూ ఇయ‌ర్‌ పార్టీ కోసం బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో వెళ్తుండ‌డం వీడియోలో ఉంది. ఈ ఇద్దరితో పాటు యువ ఆట‌గాడు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ కూడా వీడియోలో క‌నిపించారు. ఈ వీడియోను విరాట్ అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో తెగ షేర్ చేస్తుండ‌డంతో వైర‌ల్‌గా మారింది. అనేక మంది తమ అభిమాన క్రికెటర్ ను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ కోహ్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News