నేటి నుంచి క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్

క్రికెట్ ను అభిమానించే వారికి నేటి నుంచి గుడ్ న్యూస్. ఈరోజు నుంచి టెస్ట్ ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతుంది.;

Update: 2024-09-19 02:17 GMT

india vs bangladesh

క్రికెట్ ను అభిమానించే వారికి నేటి నుంచి గుడ్ న్యూస్. ఈరోజు నుంచి టెస్ట్ ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ ను ఆరు నెలల విరామం అనంతరం టీం ఇండియా ఆడుతోంది. ఇటీవల పాకిస్థాన్ ను ఓడించిన బంగ్లాదేశ్ మంచి ఊపు మీదుంది. భారత్ ను కూడా టెస్ట్‌లో ఓడించి రికార్డును క్రియేట్ చేయాలని బంగ్లదేశ్ తహతహలాడుతుంది.

స్పిన్నర్లను ఎదుర్కొనడం...
కానీ భారత్ ను టెస్ట్‌లో అదీ తమ సొంతగడ్డమీద ఓడించడం సులువు కాదు. అది స్పిన్ పిచ్ కావడం, రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్, అక్షర్‌పటేల్ వంటి సత్తా ఉన్న బౌలర్లు ఉండటంతో గెలుపు సాధ్యం కాదన్నది క్రీడాపండితుల విశ్లేషణ. రెండు జట్లు మంచి ఫామ్ లో ఉండటంతో టెస్ట్ క్రికెట్ లో ఇరు జట్లు డ్రాతో ముగిస్తాయా? గెలిచి సత్తా చాటతాయా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News