Nitheesh Kumar Reddy : అదృష్టం వచ్చే లోగా బ్యాడ్ లక్ తలుపు తట్టడం అంటే ఇదేనేమో?

నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీం ఇండియాలో చోటు దక్కిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు

Update: 2024-06-27 04:18 GMT

నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీం ఇండియాలో చోటు దక్కిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నితీష్ జింబాబ్వే పర్యటనకు వెళ్లడం లేదు. అతడి స్థానంలో శివమ్ దూబెను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. నితీష్ కుమార్ రెడ్డిని జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది. విశాఖకుచెందిన నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరుపున ఆడి సత్తా నిరూపించాడు. అనేక సార్లు జట్టు విజయానికి తోడ్పడ్డాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. టీం ఇండియా జెర్సీతో మెరిసిపోతాడని అందరూ భావించారు. కానీ అనుకోకుండా నితీష్ కుమార్ రెడ్డి జింబాబ్వే జట్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఎంపిక చేయడంతో...
జింబాబ్వే జట్టుకు నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఆ వార్త తెలిసి ఖుషీ అయ్యే లోగా ఆయన గాయపడ్డారు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంతో తెలుగు వాడికి దక్కిన ఛాన్స్ గా అందరూ భావించారు. జింబాబ్వేతో టీ 20 జట్టుకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి అక్కడ సత్తా చాటి టీం ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని అందరూ భావించారు. అయితే హెర్నియా గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉంచాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది.
టీం ఇండియాకు ఆడతాడని...
అతని స్థానంలో శివమ్ దూబెను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. మొన్నటి ఐపీఎల్ లో నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ తరుపున ఆడి మొత్తం 303 పరుగులు చేయడంతో తెలుగుతేజం ఇక దూసుకుపోతాడనుకున్న సమయంలో గాయం ఇబ్బందిపాలు చేసింది. జింబాబ్వే పర్యటన కోసం సిద్ధమవుతున్న నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో ఆయనను ీటీం ఇండియా నుంచి తప్పించింది. నితీష్ కుమార్ రెడ్డి టీం ఇండియా తరుపున ఆడతాడని, సత్తా నిరూపించుకుని జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని భావిస్తే ఇలా జరిగిందేమిటి? అని నితీష్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. మరోసారి అవకాశం వస్తుందిలే నితీష్.. బ్యాడ్ లక్.. నెక్ట్స్ టైం బెటర్ లక్.


Tags:    

Similar News