Nikhil Kumar Reddy : నిఖిల్ కుమార్ రెడ్డిపై హోప్స్ పెరిగాయిగా

నిఖిల్ కుమార్ రెడ్డి టీం ఇండియాలో చోటు సుస్థిరం చేసుకున్నట్లే కనిపిస్తుంది

Update: 2024-10-11 12:30 GMT

nikhil kumar reddy

నిఖిల్ కుమార్ రెడ్డి టీం ఇండియాలో చోటు సుస్థిరం చేసుకున్నట్లే కనిపిస్తుంది. సీనియర్లు విఫలమయినా నిఖిల్ కుమార్ రెడ్డి సక్సెస్ కావడంతోసెలెక్టర్లు నిఖిల్ పై నమ్మకం పెంచుకున్నారు. ముఖ్యంగా టీ 20లో నిఖిల్ కుమార్ రెడ్డి ఉంటే పరుగులకు ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం సెలెక్టర్లలోవ్యక్తమవుతుంది. ఏ ఆటగాడైనా కొన్ని మ్యాచ్ లలో హిట్ కావడం, కొన్ని మ్యాచ్ లలో వెంటనే అవుట్ కావడం సహజం. కానీ నిఖిల్ కుమార్ రెడ్డిఆటతీరును చూసిన టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ నిఖిల్ రెడ్డిని డ్రెస్సింగ్ రూంలో మెచ్చుకున్నట్లు తెలిసింది. కీప్ ఇట్ అప్.. బాగా ఆడావ్.. ఇలాగేకొనసాగించు అన్న మాటలు ఖచ్చితంగా నిఖిల్ కుమార్ రెడ్డి టీం ఇండియాలో కొనసాగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఒంటి చేత్తో గెలిపించి...
నిఖిల్ కుమార్ రెడ్డి మొన్న ఢిల్లీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 74 పరుగులు చేశాడు. క్లిష్టమైన దశలో ఈ పరుగులు చేశాడు. నిఖిల్ రెడ్డికి రింకూ సింగ్ తోడయ్యాడు. ఇద్దరి భాగస్వామ్యం వంద దాటింది. అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా ఏడు సిక్సర్లు బాదాడు. సిక్సర్లను కూడా అలవోకగా కొట్టడంతో గౌతమ్ గంభీర్ సయితం విస్మయం వ్యక్తం చేశాడు. నిఖిల్ రెడ్డి టాలెంట్ ను ముందే గుర్తించిన సెలెక్టర్లు నిఖిల్ రెడ్డిని రెండో మ్యాచ్ లోనూ దించారు. తొలి టీ 20 మ్యాచ్ లోనూ నిలకడగా రాణించారు. అయితే స్ట్రయికింగ్ కు తక్కువ అవకాశాలు రావడంతో నిఖిల్ రెడ్డి పెద్దగా పరుగులు చేయకపోయినా నిలకడగా తన బ్యాట్ కు పని చెప్పాడు.
ఆల్ రౌండర్ గా...
నిఖిల్ కుమార్ రెడ్డి కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ పరంగా కూడా ఉపయోగపడుతుండటంతో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో మన తెలుగు కుర్రాడు నిఖిల్ రెడ్డి టీం ఇండియాలో చోటు సుస్థిర పర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి వాళ్లు విఫలమయినా కుర్రోడు నిఖిల్ రాణించడంతో సెలెక్టర్లు అతనిపై హోప్స్ బాగానే పెట్టుకున్నారు. రేపు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో మాత్రమే కాకుండా రానున్న కాలంలో టీం ఇండియా ఏ టీ20 ఏ జట్టుతోనైనా మ్యాచ్ ఆడినా మన నిఖిల్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉందనడంలో ఎంత మాత్రం సందేహం లేదంటున్నారు. ఆల్ ది బెస్ట్ నిఖిల్.
Tags:    

Similar News