India Vs Bangladesh T20 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ నేడు ఆదివారం టీ 20.. ఎవరిదో విక్టరీ?

నేడు భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. గ్వాలియర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Update: 2024-10-06 05:47 GMT

నేడు భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. గ్వాలియర్‌లో‌ని మాధవరావ్ సింథియా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యచ్ జరుగుతుంది. ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇది దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ టీ 20 సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని తహతహలాడుతుంది. ఒకరకంగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఆదివారం మంచి ఫీస్ట్ వంటిదే. మొత్తం మూడు సిరీస్ టీ 20 మ్యాచ్‌లలో ఎవరిది పై చేయి అన్నది చూడాలి. టీం ఇండియా కుర్రోళ్లతో ఊగిపోతుంది. పూనకాల లోడింగ్ తరహాలో మన టీం దూకుడు మీద ఉండటంతో పెద్దగా కష్టపడకుండానే గెలుస్తుందన్నది క్రీడా నిపుణుల అంచనా.

తెలుగు కుర్రోడికి ఛాన్స్...
అయితే భారత్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరుగుతున్నందున రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సిరాజ్, అక్షర్ పటేల్ లకు సెలెక్టర్లు విశ్రాంతి నిచ్చారు. అయితే మిగినన జట్టు సభ్యులు ఎలా ఆడతారన్నదానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మయాంక్ యాదవ్ ఎంట్రీతో బ్యాటింగ్ పరంగా జైశ్వాల్ లేని భర్తీని పూర్తి చేసే అవకాశముందంటున్నారు. ఇక మన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డికి ఆడే ఛాన్స్ దక్కే అవకాశం ఉండొచ్చంటున్నారు. ఇక అభిషేక్ శర్మ ఎటూ ఉండనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
కుర్రాళ్లతో నిండిపోయి...
సంజూ శాంసన్ ఇటు వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా బరిలో దిగే అవకాశముంది. డెత్ ఓవర్స్ లో దూకుడుగా ఆడే హార్థిక్ పాండ్యా కూడా ఉన్నారు. రియాన్ పరాగ్ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకునే వీలుంది. వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేయవచ్చు. రవిబిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్ల చేయి తిరిగితే ఇక చెప్పాల్సిన పనిలేదు. అర్షదీప్ రాణిస్తుండటంతో కొంత మేర ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలా టీం ఇండియా కుర్రోళ్లతో నిండిపోయింది. వారందరికీ ఈ సిరీస్ ద్వారా తాము అంతర్జాతీయ క్రికెట్ లో చోటు సుస్థిరం చేసుకునే వీలుంది.
బంగ్లా జట్టును పరిశీలిస్తే...
బంగ్లాదేశ్ జట్టును చూస్తే దానిని కూడా తీసివేయడానికి లేదు. టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఓటమి పాలయిన బంగ్లా పులులు కసిమీదున్నారు. మహ్మదుల్లా, ముస్తాఫిజుర్, లిటన్‌దాస్ వంటి మంచి ఊపు మీదున్నారు. ఇక తస్కిన్ మెహదీ హసన్ వంటి ఎక్స్‌పీరియన్స్ ఆటగాళ్లు బంగ్లా జట్టులో ఉండటం అదనపు బలంగా అనుకోవచ్చు. ఇక ఆల్ రౌండర్ గా ఉన్న షకీబ్ లేకపోవడంతో బంగ్లాజట్టు కాస్త బలహీనంగా పైకి కనపడుతున్నా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. కుర్రోళ్లు ఆవేశ పడకుండా ఆట మీద ఫోకస్ పెడితే విజయం సాధించవచ్చు. పిచ్ కూడా సహకరించే అవకాశముంది. వాతావరణం కూడా పొడిగా ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఇక మ్యాచ్ కు వర్షం అడ్డంకి లేనట్లే.





Tags:    

Similar News