India Vs Bangladesh T20 : బంగ్లాదేశ్ పై ఏడు వికెట్ల తేడాతో భారత్ గెలుపు
ఇండియా - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సులువుగా భారత్ సొంత మయింది. గ్వాలియర్‌లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది
ఇండియా - బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సులువుగా భారత్ సొంత మయింది. గ్వాలియర్‌లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ ను ఇటు బౌలింగ్ లో, అటు బ్యాటింగ్ లోనూ చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు. సూర్య అంచనాలు నిజమయ్యాయి. అతి తక్కువ స్కోరుకే బంగ్లాను భారత్ కట్టడి చేయగలిగింది. భారత్ బౌలర్లందరూ తమ సత్తా చాటారు. అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు వెంట వెంటనే వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ కేవలం 19.5 పరుగులకే ఆల్ ఆవుట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా హసన్ మిరాజ్ 35 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్ షాంటో 27 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక తర్వాత ఎవరూ పెద్దగా పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగిరారు. వరుణ్ చక్రవర్తి మూడు, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు.