గెలిచిన భారత్.. ఇప్పుడు తిట్టగలరా?

3 వికెట్ల నష్టానికి 62 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన

Update: 2024-01-04 11:44 GMT

భారత్ లో టెస్ట్ మ్యాచ్ జరిగిందంటే.. మూడో రోజు కానీ.. నాలుగోరోజు కానీ స్పిన్ కు అనుకూలించి ఒకే రోజు ఎక్కువ వికెట్లు పడితే భారత్ లోని పిచ్ లను తిట్టడానికి ఓ వర్గం రెడీగా ఉంటుంది. స్పిన్ పిచ్ లను తయారు చేసుకుని భారత్ గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని.. అందుకే ఆ జట్టుకు స్వదేశంలో ఎక్కువ విజయాలు అంటూ చెబుతూ నోటికి పని చెబుతూ ఉంటారు. అదే విదేశాల్లో మాత్రం ఒకే రోజు పేస్ పిచ్ లో 20 కంటే ఎక్కువ వికెట్లు పడితే? అందరూ సైలెంట్ గా ఉండిపోతారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మొదటి రోజు 23 వికెట్లు పడగా.. రెండో రోజు లంచ్ లోపు దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. ఇక 79 పరుగులను చేరుకోడానికి భారత జట్టు కూడా ఓ మోస్తరు వికెట్లను కోల్పోయింది. అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్ట్ మ్యాచ్ గా రికార్డుకు ఎక్కింది. ఇప్పుడు ఈ పిచ్ గురించి మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారనుకోండి.

3 వికెట్ల నష్టానికి 62 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు మరో 114 పరుగులు చేసి.. మిగతా 7 వికెట్లు కోల్పోయింది. 176 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌ము 79 పరుగుల లక్ష్యం నిలిపించింది. 62/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో మూడు పరుగులు జోడించిన తర్వాత నాలుగో వికెట్ కోల్పోయింది. డేవిడ్ బెడింగ్ హామ్(11)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే వికెట్ కీపర్ కైల్ వెరైన్‌ (9) ను బుమ్రా అవుట్ చేశాడు. ఓపెనర్ ఎయిడెన్ మార్‌క్రమ్ మాత్రం టెయిలెండర్ల అండతో జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. మార్‌క్రమ్ వ్యక్తిగత స్కోరు 73 వద్ద ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేయడంతో మార్‌క్రమ్ సెంచరీ బాదాడు. మార్‌క్రమ్ (106)ను మహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడంతో 51 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు అవుట్ అవ్వడంతో 176 పరుగులు చేసింది సఫారీ జట్టు. దీంతో భారత్ ముందు 79 పరుగుల లక్ష్యం నిలిపింది.
ఈ స్కోరును ఛేజ్ చేయడానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ 28 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. గిల్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయ్యర్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాలుగున్నర సెషన్స్ లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. భారత్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది.


Tags:    

Similar News