Yashaswi Jaishwal : టీ 20లే కాదు.. టెస్ట్‌లో కూడా రారాజునే
యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ చేశారు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రికార్డు సాధించాడు
యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ చేశారు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రికార్డు సాధించాడు. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లోనే తొలి డబుల్ సెంచరీ చేశాడు. విశాఖలో భారత్ - ఇంగ్లండ్ రెండో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. అందులో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. కేవలం 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అందరినీ అలరించాడు. మళ్లీ అవే షాట్లు.. అవే సిక్సర్లు.. టీ 20లలోనే కాదు టెస్ట్ మ్యాచ్ లోనూ తనకు తిరుగులేదని యశస్వి నిరూపించాడు.
సిక్స్‌లు.. ఫోర్లతో...
అయితే 209 పరుగుల వద్ద యశస్వి జైశ్వాల్ అవుట్ అయ్యాడు. ఈ 209 పరుగుల్లో ఏడు సిక్స్‌లున్నాయి. పంధొమ్మిది ఫోర్లున్నాయి. అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన భారత్ మూడో క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటికే చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన వాళ్లలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ లు ఉన్నారు. k భారత్ తొలి ఇన్నింగ్స్ 396 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. నిన్న 336 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఈరోజు ఉదయం అరవై పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
ఐపీఎల్ నుంచి...
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో మెరిసిన ఈ కుర్రోడు తన కెరీర్ ను అద్భుతంగా మలచుకున్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటడంతో టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. కేవలం టీ 20లలోనే కాదు వన్డేలలోనూ అదరగొడుతున్న యశస్వి జైశ్వాల్ టెస్ట్ లోనూ డబుల్ సెంచరీ చేయడంతో ఇక్కడ కూడా నిలదొక్కుకున్నట్లే. అలా ఐపీఎల్ నుంచి టెస్ట్ మ్యాచ్ ల వరకూ ఈ పానీపూరీ అమ్మిన కుర్రోడు ప్రత్యర్థులను పరేషాన్ చేస్తూ ఇండియాకు తురుపుముక్కలా మారాడనడంలో ఎలాంటి సందేహం లేదు.