Telangana Budget : తెలంగాణ వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్లు
తెలంగాణలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు;

తెలంగాణలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమంగా పరుగులు పెట్టించడంలో తమ ప్రభుత్వం సక్సెస్ అయిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి కోసమూ తాకట్టు పెట్టకుండా ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తూ జవాబుదారీ తనంతో పాలన అందిస్తున్నామని తెలిపారు. గత దశాబ్దకాలంలో పాలన పరంగా విధ్వంసమైందని, దానిని గాడిలో పెడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలను, లక్ష్యాలను ఉంచుకుని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిపై నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని, వారి కుట్రలను సమర్ధవంతంగా తిప్పుకొడుతూ పాలనను ముందుకు తీసుకెళుతున్నామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎప్పటికప్పుడు సత్యాలు ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు.