విపక్ష ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఈటల

టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ తొలిసారి విపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు

Update: 2022-03-07 04:30 GMT

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు, ఆ తర్వాత టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ తొలిసారి విపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. టీఆర్ఎస్ లో దాదాపు దశాబ్దన్నర కాలం పాటు కొనసాగిన ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఉప ఎన్నికలో.....
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీకి 2018 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ఇప్పుడ ఆ సంఖ్య మూడుకు చేరింది. కేసీఆర్, ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో ముఖాముఖి కలుసుకోనున్నారు.


Tags:    

Similar News