Telangana : నేడు తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో నేడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది;

తెలంగాణ శాసనసభలో నేడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే ఐదు శాతం అంచనాలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. అంటే మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే అవకాశముంది.
ముందు కేబినెట్ భేటీ...
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుతం అమలవుతున్న వాటితో పాటు ఈ ఏడాది అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన వాటికి కూడా నిధుల కేటాయింపు చేస్తారని అంటున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం బడ్జెట్ ను ఆమోదించనుంది. అనంతరం 11.14 గంటలకు మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.